ఎప్పుడూ... ఒప్పుకోవద్దురా ఓటమీ... Lyrics written by SIRIVENNELA

ఎప్పుడూ... ఒప్పుకోవద్దురా ఓటమీ...
ఎప్పుడూ.. వదులుకోవద్దురా ఓరిమీ...


విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా...


ఎప్పుడూ... ఒప్పుకోవద్దురా ఓటమీ...
ఎప్పుడూ.. వదులుకోవద్దురా ఓరిమీ...


నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా... సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా... పశ్చిమాన పొంచి ఉండు రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా... గుటక పడని అగ్గి ఉండ సాగరాన ఈదుకుంటు తూరుపింట తేలుతుందిరా... నిసానినాపుటెంత సెపురా... ఉషోదయాన్ని ఎవ్వడాపురా... రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేనురా...


ఎప్పుడూ... ఒప్పుకోవద్దురా ఓటమీ...
ఎప్పుడూ.. వదులుకోవద్దురా ఓరిమీ...


నొప్పిలేని నిమిషమేది.. జననమైన, మరణమైన.... జీవితాన అడుగు అడుగునా...
నీరసించి నిలిచిపోతే, నిమిషమైన నీది కాదు... బ్రతుకు అంటే నిత్య ఘర్షణ..

దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువుంది, ఇంతకన్న సైన్యముండునా...
ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయమ్ము సారధౌనురా...

నిరంతరం ప్రయత్నమున్నదా... నిరాశకే నిరాశ పుట్టదా ...
ఆయువంటు ఉన్నవరకు చావుకూడ నెగ్గలేక.. శవముపైనే గెలుపు చాటురా...


ఎప్పుడూ... ఒప్పుకోవద్దురా ఓటమీ...
ఎప్పుడూ.. వదులుకోవద్దురా ఓరిమీ...Sirivennela Seetharama Sastry kalam nundi jaaluvaarina ee paata Suman natinchina PATTUDALA cinema loniodi. Madavapeddi Suresh sangeethanni andinchaga Yesudas aalapincharu. Oka laxyam kosam velutunnappudu enni otamulu eduraina vatini pattinchukokunda mana prayatnanni pattudalatho konasagiste vijayam manade ani ee paatalo vivarincharu Sirivennela.

0 comments:

Post a Comment