Dont Encourage Piracy - Save Cinema

ఒక సగటు సినిమా ప్రేమికుడిగా నా భాధ, ఆకాంక్ష ఇది.

పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీకి పెద్ద సమస్యగా మారిపోయింది. మగధీర సినిమా విడుదలైన ఒక వారానికి,నేను "సూర్య సన్ ఆఫ్ క్రిష్నన్" మూవీ సిడి కి షాప్ కి వెళ్తే వాడి దగ్గర అది లేదు. కాని "మల్లన్న", "మగధీర" సినిమాలు ఉన్నాయి. చాలా భాద అనిపించింది అది చూసి. ఏన్నో కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాని 20 రూపాయలకి ఒకే ఇంట్లో 20 మంది చూసేస్తున్నారు.
మనకి ఎన్నో ఏళ్ళుగా ఉన్న ఏకైక వినోద సాధనం సినిమా. ప్రేక్షకుడి వినోదం కోసం ఒక్క సినిమా తీస్తే, ప్రత్యక్షంగా,పరోక్షంగా వేల మంది ఉపాధి పొందుతారు. నిర్మాత నుండి సైకిల్ స్టాండ్ వాడి వరకు అందరూ ఆధారపడి ఉంటారు.

సినిమా రిలీజైన రోజునే సిడి దొరుకేస్తుందంటే 2,3 సంవత్సరాలు సినిమా తీయడానికి వాళ్ళు పడ్డ శ్రమ వౄధా అయినట్లే కదా!
ఈ పైరసీని ధియేటర్ స్థాయి లోనే అరికడితే అసలు సమస్యే ఉండదని నా అభిప్రాయం.

ఇంకా సిడి షాపుల మీద నిఘా వేయడం కూడా ఒక మార్గం. "అరుంధతి" సినిమానే తీసుకుంటే, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఈ మార్గం ద్వారానే మొదటి నాలుగు వారాలు పైరసీని అదుపు చేయగలిగారు. దాని ప్రభావం ఆ సినిమా కలెక్షన్లలో స్పష్టంగా కనపడింది.

నిర్మాత రవిచంద్ర చేస్తున్న నిరాహార ధీక్షకు సినీ పరిశ్రమ నుండి మంచి స్పందనే వచ్చింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎన్నో వేల, లక్షలమందికి ఉపాధి చూపిస్తున్న తెలుగు సినీ పరిశ్రమ బ్రతకాలంటే పరిశ్రమలోని అన్ని విభాగాల సాంకేతిక నిపుణులు, కళాకారులు ఏకత్రాటిపై నిలవాల్సిన సమయమిదే.

ఇంతకు ముందు కూడా ఎన్నో సార్లు పరిశ్రమ పెద్దలు ఈ సమస్యను ప్రభుత్వం ధృష్ఠికి తీసుకు వెళ్ళినప్పటికీ, సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం చాలా ఊదాసీనతను కనబరిచింది. ఇప్పటికైనా ఉన్న చట్టాలను కఠినతరం చేసి ఈ రుగ్మత నుండి సినీ పరిశ్రమను బయట పడేసి ఈ వినోద సాధనం ఆయుష్షును పెంచితే, సినీ కార్మికులే కాదు, నాలాంటి సినీ ప్రేమికులు కూడ సర్వదా కృతజ్ణులై ఉంటారు.

సాధారణ మధ్య తరగతి ప్రేక్షకుడుకి ..........................
కొంచెం బోర్ కొడితే సినిమా....ఫ్రెండ్స్ కి పార్టీ అంటే సినిమా...
పిల్లలకు సెలవైతే సినిమా...కొత్తగా పెళ్ళైనా సినిమానే.

ఇటువంటి సినిమా బతకాలంటే, పైరసీ ని అరికట్టాలి. పైరసీ సిడి అమ్మడమే కాదు. చూడడం కూడా నేరంగా భావించండి.

సినిమా ని స్వచ్చంగా, రసానుభూతిని కోల్పోకుండా ఆస్వాదించాలంటే ధియేటర్ కి వెళ్ళే చూడండి.
So Dont Encourage Piracy and Save Cinema.

0 comments:

Post a Comment