Best Songs of the Year - Oy!


నాకు మెలొడీ టచ్ ఉన్నపాటలంటే ఇష్టం. సాధారణంగా ఆ పాటలే కలకాలం నిలిచిపోతాయి. ఆ పాటల సాహిత్యం కూడా మనకి స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ మధ్య కాలంలో మన పాటల్లో ఉన్న లిరిక్స్ ఏమిటో రాసినవాడికి తప్ప వేరే వాడికి అర్ధం కావట్లేదు. ఇటువంటి సమయం లో వచ్చిన ఓయ్ సినిమా లోని పాటలు వింటే చాలా సంతోషం వేసింది ఇంకా ఇటువంటి పాటలు వస్తున్నాయని.
ఈ సినిమాలొని పాటలన్ని సిట్యుయేషనల్ సాంగ్స్. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. ఆయన తండ్రికి తగ్గ తనయుడు. తనిచ్చిన ఈ మ్యూజిక్ న భూతో న భవిష్యతి.

ఈ సినిమ హీరొ అయిన సిధార్ధ్ కి మంచి మ్యూ జిక్ టేస్ట్ ఉంది. ఏ సినిమా కి లేని విధంగా ఆల్బం ప్రొడ్యూసర్ అని సిధార్ధ్ పేరు వేసారు. తను దగ్గరుండి కంపోజ్ చేయించాడు. ఒక పాట కూడా పాడాడు. తను ఒక ప్రొఫెషనల్ సింగర్ లా పాడుతున్నడు. Hats off to Sidhartha.

ఆన్ని పాటల్లొ మంచి సాహిత్యం ఉంది. ఆవి క్లియర్ గా అర్దమవుతున్నాయి.సింగర్స్ శ్రేయ ఘొషల్, కె కె , కార్తీక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువన్ శంకర్ రాజా కూడా ఒక పాట పాడాడు. మంచి ఫీల్ తో పాడాడు.

చంద్రబోస్,అనంత శ్రీనివాస్,వనమాలి ల సాహిత్యం చాలా బాగుంది. ముఖ్యంగా వనమాలి వ్రాసిన "చిరునవ్వే నవ్వుతూ" అద్భుతంగా ఉంది.

సినిమా లొ ఈ పాటలను చాలా కలర్ ఫుల్ గా చూపించాడు కెమెరా మెన్ కళ్యాన్.సి.చక్రవర్తి. మంచి లొకేషన్స్ లో సాంగ్స్ పిక్చరైజ్ చేసారు. కాబట్టి స్ర్కీన్ మీద కూడా చాలా బాగున్నాయి.

ఇప్పుడు వస్తున్న పాటలన్నీ బూతులతో కొరికెయ్,తినేయ్,గిల్లేయ్ లాంటి చెత్త పదాలతో ఉంటున్నాయి.
మంచి సంగీతం, సాహిత్యం ఉన్న ఈ పాటలు మనసుకి ఆహ్లాదాన్ని , ప్రశాంతతని ఇస్తాయి.

0 comments:

Post a Comment