Dont Encourage Piracy - Save Cinema

ఒక సగటు సినిమా ప్రేమికుడిగా నా భాధ, ఆకాంక్ష ఇది.

పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీకి పెద్ద ప్రోబ్లంగ మారిపోయింది. నిన్న నేను "సూర్య సన్ ఆఫ్ క్రిష్నన్" మూవీ సిడి కి షాప్ కి వెళ్తే వాడి దగ్గర అది లేదు. కాని "మల్లన్న", "మగధీర" సినిమాలు ఉన్నాయి. చాలా భాద అనిపించింది అది చూసి. ఏన్నో కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాని 20 రూపాయలకి ఒకే ఇంట్లో 20 మంది చూసేస్తున్నారు.
మనకి ఎన్నో ఏళ్ళుగా ఉన్న ఏకైక వినోద సాధనం సినిమా. ప్రేక్షకుడి వినోదం కోసం ఒక్క సినిమా తీస్తే, ప్రత్యక్షంగా,పరోక్షంగా వేల మంది ఉపాధి పొందుతారు. నిర్మాత నుండి సైకిల్ స్టాండ్ వాడి వరకు అందరూ ఆధారపడి ఉంటారు.

సినిమా రిలీజైన రోజునే సిడి దొరుకేస్తుందంటే 2,3 సంవత్సరాలు సినిమా తీయడానికి వాళ్ళు పడ్డ శ్రమ వౄధా అయినట్లే కదా!

సాధారణ మధ్య తరగతి ప్రేక్షకుడుకి ..........................
కొంచెం బోర్ కొడితే సినిమా....ఫ్రెండ్స్ కి పార్టీ అంటే సినిమా...
పిల్లలకు సెలవైతే సినిమా...కొత్తగా పెళ్ళైనా సినిమానే.

ఇటువంటి సినిమా బతకాలంటే, పైరసీ ని అరికట్టాలి. పైరసీ సిడి అమ్మడమే కాదు. చూడడం కూడా నేరంగా భావించండి.

సినిమా ని స్వచ్చంగా,ఫీల్ మిస్స్ కాకుండా ఆస్వాదించాలంటే ధియేటర్ కి వెళ్ళే చూడండి.
So Dont Encourage Piracy and Save Cinema

0 comments:

Post a Comment